”2022 వరకు ధోని ఐపీఎల్ ఆడతాడు”…

|

Aug 12, 2020 | 9:36 PM

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ టోర్నీ వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. దీనితో ఇప్పుడు అందరి కళ్ళు ధోనిపైనే ఉన్నాయి.

2022 వరకు ధోని ఐపీఎల్ ఆడతాడు...
Follow us on

MS Dhoni Will Play Until 2022 IPL: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ టోర్నీ వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. దీనితో ఇప్పుడు అందరి కళ్ళు ధోనిపైనే ఉన్నాయి. అతడు ఎలా ఆడతాడోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాధన్ మాత్రం తనకు ధోని ఫామ్ పై ఎలాంటి ఆందోళన లేదని చెప్పుకొచ్చాడు. ‘ధోని ఏంటో మాకు తెలుసు’ అని చెప్పిన ఆయన… అతడి మీద మాకు పూర్తి నమ్మకం ఉందని… 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో మహీ ఖచ్చితంగా ఆడతాడని అన్నారు. బహుశా 2022 ఐపీఎల్‌లో కూడా ధోని ఆడే అవకాశం ఉందని పేర్కొన్నారు.