సినిమా ఛాన్స్ కోసం వెళ్తే బట్టలిప్పి నిలబడమన్నాడు

సినిమా ఛాన్స్ కోసం వెళితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ దారుణంగా ప్రవర్తించాడంటూ మోడల్ డింపుల్ పౌలా బాంబు పేల్చింది. తనకు అప్పుడు 17ఏళ్లని హౌస్ ఫుల్ సినిమాలో పాత్రకోసం అతని దగ్గరకు వెళ్లానని..

సినిమా ఛాన్స్ కోసం వెళ్తే బట్టలిప్పి నిలబడమన్నాడు

Updated on: Sep 11, 2020 | 8:41 PM

సినిమా ఛాన్స్ కోసం వెళితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ దారుణంగా ప్రవర్తించాడంటూ మోడల్ డింపుల్ పౌలా బాంబు పేల్చింది. తనకు అప్పుడు 17ఏళ్లని హౌస్ ఫుల్ సినిమాలో పాత్రకోసం అతని దగ్గరకు వెళ్లానని చెప్పింది డింపుల్. గదిలోకి పిలిచిన సాజిద్ తన ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలబడమని లైంగికంగా వేధించాడని తెలిపింది. నాకంటే ముందు అలా ఎంతమంది అమ్మాయిలను సాజిద్ ఖాన్ వేధించాడో దేవుడికే తెలుసన్న ఆమె.. ఇలాంటి కామాంధులు ఉండాల్సింది సమాజంలో కాదు కటకటాల వెనుక అని తన ఆక్రోశాన్ని వెలిబుచ్చింది. అతడి నిజస్వరూపాన్ని ఇన్నాళ్లూ బయటపెట్టకపోవడం నేను చేసిన తప్పుని పౌలా పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. కుటుంబ పోషణ కోసం నా సంపాదన అవసరం కావడంతో సైలెంట్‌గా ఉండిపోయా. ఇప్పుడు నా బ్రతుకు నేను బతుకుతున్నా. అందుకే ఇప్పుడు ధైర్యంగా బయటికొచ్చిచెబుతున్నా’ అని పౌలా తెలిపింది. ఇలాఉండగా, మీటూ ఉద్యమం ప్రారంభమైనపుడు సాజిద్ ఖాన్‌పై బాలీవుడ్ లో చాలా మంది నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us