ఒక్కొక్కరుగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కేబినెట్ నుంచి క్రీడామంత్రి రాజీనామా, బీజేపీ వైపు చూపా?

| Edited By: Ravi Kiran

Jan 06, 2021 | 10:40 AM

పశ్చిమ బెంగాల్ లో మరో మంత్రి రాజీనామా చేశారు. క్రీడల శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా మంగళవారం పదవి నుంచి వైదొలిగారు. ఇటీవలే పార్టీ సీనియర్ నేత సువెందు అధికారి..

ఒక్కొక్కరుగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కేబినెట్ నుంచి క్రీడామంత్రి రాజీనామా, బీజేపీ వైపు చూపా?
Follow us on

పశ్చిమ బెంగాల్ లో మరో మంత్రి రాజీనామా చేశారు. క్రీడల శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా మంగళవారం పదవి నుంచి వైదొలిగారు. ఇటీవలే పార్టీ సీనియర్ నేత సువెందు అధికారి సహా పలువురు నేతలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.  దీంతో ఈయన రాజీనామా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ సమయంలో పాలక టీఎంసీకి ఇలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సువెందు అధికారి బీజేపీలో చేరినప్పటి నుంచి దీదీకి ట్రబుల్స్ ప్రారంభం కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల సమయానికి  మమత పార్టీలో  ఒంటరిగా మిగిలిపోతారని హోం మంత్రి  అమిత్ షా ఆ మధ్య జోస్యం చెప్పారు.

కాగా శుక్లా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి, గవర్నర్ కు పంపారు. అందులో రాజకీయాల నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు మాత్రమే పేర్కొన్నారు. మరే  కారణాన్ని ఆయన స్పష్టం చేయలేదు. సువెందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కూడా  గతవారం బీజేపీలో చేరిన విషయం గమనార్హం. కౌన్సిలర్ అయిన ఈయనతో బాటు మరో డజను మంది కౌన్సిలర్లు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.