తెలంగాణకు కేంద్రం శుభవార్త..

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కంపా కింద రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు […]

తెలంగాణకు కేంద్రం శుభవార్త..

Updated on: Aug 29, 2019 | 6:22 PM

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కంపా కింద రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.3,110 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. కాగా, ప్రస్తుతం ఉన్న అడవులను రానున్న నాలుగేళ్లలో రెట్టింపు చేసే విధంగా పథకాలు కొనసాగించాలని సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకానికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us