చంద్రబాబుపై బాలినేని సెటైర్లు.. ఆయనొస్తే వాటంతటవే అవి ఆగిపోతాయంటూ ఎద్దేవా.. ఒంగోలులో మంత్రి మాటా మంతి

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో...

  • Rajesh Sharma
  • Publish Date - 1:51 pm, Sun, 29 November 20
చంద్రబాబుపై బాలినేని సెటైర్లు.. ఆయనొస్తే వాటంతటవే అవి ఆగిపోతాయంటూ ఎద్దేవా.. ఒంగోలులో మంత్రి మాటా మంతి

Minister Balineni satires on Chandrababu: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. చంద్రబాబు పర్యటిస్తే వర్షాలు వాటంతట అవే ఆగిపోతాయని భావిస్తున్నామంటూ ఎగతాళి చేశారు మంత్రి. వరుస తుఫాన్లతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే అకాల వర్షాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు.

ఎక్కడో ఇంట్లో కూర్చుని జూమ్‌ యాప్‌ల ద్వారా ఆరోపణలు చేయడం కాదు… క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. బాధితులను పరామర్శించేందుకు కూడా చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో చిన్నారుల కోసం మాజీ సైనికులు అందించిన ఇంక్యుబేటర్‌ పరికరాన్ని మంత్రి బాలినేని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి బాలినేని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దక్షిణాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఇబ్బందులను ఎదుర్కొన్న వారికి ఏపీ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీలోగా బాధితులకు వరద సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈనేపథ్యంలోనే మంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేయడం చర్చనీయాంశమైంది.