జమ్ము కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం దగ్గర అరుదైన, అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఆయల ఆలయ పరిసరాల్లో మంచు వర్షం కురుస్తోంది. రాత్రిపూట.. విద్యుత్ దీపాల వెలుగుల్లో.. హిమపాతం కనువిందు చేస్తోంది. వైష్ణోదేవి ఆలయం, పరిసర ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి.
జమ్ము కశ్మీర్‌లోని కత్రాలో వైష్ణోదేవి ఆలయం ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మంచువర్షం కురవడం కామన్. అయితే.. కత్రాలో ఈ సీజన్‌లో తొలి హిమపాతం ఇది. దీంతో.. అమ్మవారి భక్తులు, పర్యాటకులు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కోవిడ్ కారణంగా దాదాపు ఆరు నెలలు మూతబడిన మాతా వైష్ణోదేవి ఆలయాన్ని ఆగస్టులో తెరిచారు. రోజుకు 7 వేల మంది భక్తులను అనుమతించేవారు. కోవిడ్ ప్రభావం తగ్గడంతో రోజుకు 15వేల మంది భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నారు అధికారులు. ఇప్పుడీ హిమపాతంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH: Mata Vaishno Devi Shrine in Katra, Jammu and Kashmir received snowfall today. pic.twitter.com/TE2YeZicy2
— ANI (@ANI) December 27, 2020