పుట్టిలో అక్రమ మద్యం తరలిస్తూ బోల్తా.. ఒకరు గల్లంతు

|

Aug 17, 2020 | 9:57 PM

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలో తుంగభద్ర నదిలో ఆదివారం రాత్రి ఓ యువకుడు గల్లంతయ్యాడు.

పుట్టిలో అక్రమ మద్యం తరలిస్తూ బోల్తా.. ఒకరు  గల్లంతు
Follow us on

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలో తుంగభద్ర నదిలో ఆదివారం రాత్రి ఓ యువకుడు గల్లంతయ్యాడు. రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు తమ గ్రామం నుంచి ప్రతి రోజు పుట్టిలో అక్రమంగా మద్యాన్ని తుంగభద్ర నది మీదుగా రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్‌కు చెందిన పుట్టిలో 36 మద్యం కేసులను తీసుకొని నది దాటుతుండగా ఉన్నట్టుండి ప్రవాహం పెరుగింది. దీంతో మద్యం బాటిళ్లతో సహా ముగ్గురు పుట్టితో మునిగిపోయారు. దీంతో ముగ్గురు నదిలో మునిగి పోగా అంజి, రాఘవేంద్ర ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఈత రాకపోవడంతో రవి నదిలో మునిగి గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శాంతినగర్ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో రవికోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న శాంతినగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.