పిచ్చెక్కిందా ఏంటి.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో వ్యక్తి తిక్క చేష్టలు.. సోషల్ మీడియాలో వైరలయిన దృశ్యాలు

ఎయిర్ లైన్స్ అధికారులు అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చారు. మరికాసేపట్లో ఆ విమానం టేకాఫ్ కానుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ.. నేరుగా విమానం రెక్కపైకి(వింగ్) ఎక్కేశాడు. వింగ్‌పై నిల్చుని విన్యాసాలు చేశాడు. ఈ ఘటన అమెరికాలోని లాస్ వేగాస్‌‌లోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో...

  • Shiva Prajapati
  • Publish Date - 7:27 pm, Sun, 13 December 20
పిచ్చెక్కిందా ఏంటి.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో వ్యక్తి తిక్క చేష్టలు.. సోషల్ మీడియాలో వైరలయిన దృశ్యాలు

ఎయిర్ లైన్స్ అధికారులు అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చారు. మరికాసేపట్లో ఆ విమానం టేకాఫ్ కానుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ.. నేరుగా విమానం రెక్కపైకి(వింగ్) ఎక్కేశాడు. వింగ్‌పై నిల్చుని విన్యాసాలు చేశాడు. ఈ ఘటన అమెరికాలోని లాస్ వేగాస్‌‌లోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. మెక్‌కారన్ విమానాశ్రయంలో లాస్ వేగాస్ నుండి పోర్ట్‌లాండ్ బయలుదేరేందుకు అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సిద్ధంగా ఉంది. మరికాసేపట్లో ఆ విమానం టేకాఫ్ కానుంది. ఎయిర్ లైన్స్ అధికారులు టేకాఫ్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇంతలో ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగిప్పి.. ఫెన్సింగ్‌ను దాటుకుని నేరుగా వచ్చి ఆ విమానం రెక్కపైకి ఎక్కేసాడు. ఆపై తానేదో సూపర్‌మ్యాన్ లాగా నీల్చుని ఫోజులు ఇచ్చాడు. ఇది గమనించిన పైలెట్.. కంట్రోల్ టవర్‌కు విషయాన్ని చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు భద్రతా సిబ్బంది నానా తంటాలు పడ్డారు. చివరికి ఏదోలా అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను మీరూ చూసేయండి.