ఈసీ అమ్ముడుపోయింది – మమతా బెనర్జీ

|

May 16, 2019 | 6:03 PM

బెంగాల్‌లో అమిత్ షా ర్యాలీతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైరయ్యారు. ఇటు బీజేపీ, మోదీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ చెప్పినట్లే ఈసీ చేస్తోందని.. బీజేపీకి ఎన్నికల సంఘం అమ్ముడుపోయిందని దీదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా బీజేపీ సోదరుడిలా అధికారులు […]

ఈసీ అమ్ముడుపోయింది - మమతా బెనర్జీ
Follow us on

బెంగాల్‌లో అమిత్ షా ర్యాలీతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైరయ్యారు. ఇటు బీజేపీ, మోదీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మోదీ చెప్పినట్లే ఈసీ చేస్తోందని.. బీజేపీకి ఎన్నికల సంఘం అమ్ముడుపోయిందని దీదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా బీజేపీ సోదరుడిలా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈసీని అడ్డుపెట్టుకుని అణిచివేతకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అటు ప్రచార సమయాన్ని ఇవాళ్టికే కుదించడంపై అప్రజాస్వామికమని చంద్రబాబు, మాయావతి, అఖిలేష్ సహా ఇతర నేతలు అభిప్రాయపడ్డారు.