Malavat Poorna: పర్వతారోహణలో మరింత ఎత్తుకు మలావత్ పూర్ణ.. నాసా సైంటిస్ట్ కావ్య మన్యపుతో కలిసి “ప్రాజెక్ట్ శక్తి” యాత్ర

|

Aug 22, 2022 | 9:56 PM

పర్వతారోహకులు మలావత్ పూర్ణ, కావ్య మన్యపు ఈ సరికొత్త విజయాన్ని నమోదు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి లద్దాఖ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఎక్కని పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ క్రియేట్ చేశారు.

Malavat Poorna: పర్వతారోహణలో మరింత ఎత్తుకు మలావత్ పూర్ణ.. నాసా సైంటిస్ట్ కావ్య మన్యపుతో కలిసి “ప్రాజెక్ట్ శక్తి” యాత్ర
Malavat Purna
Follow us on

యువ పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ మరో ఘనత సాధించారు. ఆడపిల్లలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఎంపవర్, ఎడ్యుకేషన్, ఎలివేషన్ – విజన్‌తో “ప్రాజెక్ట్ శక్తి” యాత్ర చేపట్టామని పర్వతారోహకులు మలావత్ పూర్ణ, కావ్య మన్యపు ఈ సరికొత్త విజయాన్ని నమోదు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి లద్దాఖ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఎక్కని పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ క్రియేట్ చేశారు. మాలావత్‌ పూర్ణ, కావ్య ఇద్దరూ తెలంగాణలోని కామారెడ్డికి చెందినవారే వాడం విశేషం. పూర్ణ ఇప్పటికే 7 ఖండాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. అమెరికాలోని నాసాలో అంతరిక్ష పరిశోధకురాలిగా పని చేస్తున్నకావ్య మన్యపు, పూర్ణ కలిసి ఆడపిల్లల విద్య కోసం ప్రాజెక్ట్ శక్తి పేరుతో పర్వతారోహణ మొదలుపెట్టారు.

వంద మంది నిరుపేద, ప్రతిభావంతులైన బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడమే వీరి ప్రాజెక్ట శక్తి టార్గెట్. మొత్తం లక్ష డాలర్లు నిధుల సేకరణే ధ్యేయంగా పెట్టుకున్నారు. మొత్తం 8 మంది సభ్యులతో ఈ ట్రెక్కింగ్ టీమ్ పర్వతారోహణ ప్రారంభించింది. ఆ బృందానికి లీడర్‌గా రెన్సీ థామస్, డిప్యూటీ లీడర్‌గా దివ్య ఠాకూర్ వ్యవహరిస్తున్నారు. పర్వతారోహణ పూర్తి చేసుకుని ఢిల్లీ వచ్చారు.

మారుమూల గిరిజన ప్రాంతం నుంచి..

ఇవి కూడా చదవండి

తను పుట్టింది ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతం. రెసిడెన్సియల్‌ హాస్టల్‌లో ఉంటూ, చదువుకుంటున్న చిన్న పిల్ల. ఆ చదువు నే ఎప్పుడు ఆపేయాల్సి వస్తుందో కూడ తెలియని దీనస్థితి వారిది. అటువంటి పరిస్థితుల్లోనే ఆమె చదువుతో పాటుగా ట్రెక్కింగ్‌ మొదలు పెట్టింది. అలా మొదలైన తన ప్రయాణంలో ఏకంగా నేడు ఏడు శిఖరాలకు చేరింది. తనే తెలంగాణ ముద్దుబిడ్డ మాలావత్‌ పూర్ణ. మాలావత్‌ పూర్ణ ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఎవరెస్ట్‌ ఎక్కేసిన బాలికగా..

అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్‌ ఎక్కేసిన బాలికగా మాలావత్‌ పూర్ణ రికార్డు సృష్టించింది. ఆరేళ్ల వ్యవధిలోనే ఆరు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఏకైక మహిళగా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అంటార్కిటికా ఖండంలోని మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది. ఈ నెల 26న అంటార్కిటికా ఖండంలో 16 వేల 50 అడుగుల ఎత్తులో ఉన్న విస్సన్‌ మాసిఫ్‌ పర్వతంపై అడుగుపెట్టి సగర్వంగా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది.

ఎవరెస్టు శిఖరంపై జాతీయ జెండాను ఎగురవేసి..

2014లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయ జెండాను ఎగురవేసింది. 14 సంవత్సరాల అతి చిన్న వయసులో ఈ సాహసాన్ని చేసిన అమ్మాయిగా అందరి మన్ననలు పొందింది. 2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్నీ, 2017లో యూరప్‌లోని ఎల్‌బ్రస్ శిఖరాన్ని, దక్షిణ అమెరికాలోని మౌంట్ అకోన్‌గువానీ, 2019లో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌నీ అధిరోహించి రికార్డులు సృష్టించింది. ఏడు ఖండాల్లోని 7 ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్న మాలావత్ పూర్ణ.. ఆరేళ్లలో 6 ఖండాల్లోని 6 ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. పూర్ణ పేరిట హిందీ, తెలుగు, ఆంగ్ల భాషల్లో సినిమా కూడా వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం