మోదీ ప్రమాణస్వీకారం.. కమల్‌కు ఆహ్వానం

ఎన్డీయే తరఫున రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పనులు మొదలయ్యాయి. ఢిల్లీలో ఈ నెల 30న సాయంత్రం 7గంటలకు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి మోదీ ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌కు పిలుపువచ్చింది. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీ, కమల్‌ను ఆహ్వానించారు. మరి దీనిపై కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:30 pm, Mon, 27 May 19
మోదీ ప్రమాణస్వీకారం.. కమల్‌కు ఆహ్వానం

ఎన్డీయే తరఫున రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పనులు మొదలయ్యాయి. ఢిల్లీలో ఈ నెల 30న సాయంత్రం 7గంటలకు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి మోదీ ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌కు పిలుపువచ్చింది. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీ, కమల్‌ను ఆహ్వానించారు. మరి దీనిపై కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే ఇటీవల కమల్‌, గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. దానిపై బీజేపీ నేతలు సర్వత్రా విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమల్‌ను మోదీ ఆహ్వానించడం విశేషం. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ నూతన సీఎంగా ఎన్నికైన జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న విషయం తెలిసిందే.