
2021 మొదటి రోజున భారతదేశ పట్టణాభివృద్ధిని ఉద్దేశించిన నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ప్రతి ఒక్కిరికి సొంతి కళ నెరవేరుస్తూ.. లైట్ హౌస్ ప్రాజెక్టులకు పునాది వేశారు ప్రధాని. PMAY (అర్బన్)ASHA- ఇండియా అవార్డులను పంపిణీ చేశారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ (జిహెచ్‌టిసి) -ఇండియా కింద లైట్ హౌస్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పునాది రాయిని వేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్మిస్తున్న ప్రధాని తెలిపారు. కొత్త టెక్నాలజీ ఆధారంగా నిర్మాణాల్లో విపత్తులను ఎదుర్కొనేందుకు వీలుంటుందన్నారు.
Leveraging latest technologies to ensure #Housing4All. https://t.co/qHrKKdCGBJ
— Narendra Modi (@narendramodi) January 1, 2021
ఈ సందర్భంగా పిఎం మోడీ మాట్లాడుతూ.. ఆరు ప్రాజెక్టులు దేశంలో గృహనిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. గతంలోనే దేశంలో గృహనిర్మాణ ప్రాజెక్టులను తీవ్రంగా పరిగణించలేదన్న ప్రధాని.. ప్రతి ఒకరి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అగర్తాలా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, చెన్నై తోపాటు రాంచీల్లో ఎల్‌హెచ్‌పిలు నిర్మించనున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రతి ప్రదేశానికి ఎకనామిక్‌లీ బలహీన విభాగాలకు (ఇడబ్ల్యుఎస్) 1,000 కి పైగా ఇళ్లు నిర్మిస్తామన్నారు. అన్ని చట్టబద్ధమైన ఆమోదాల తర్వాత ఈ సైట్‌లను నిర్మాణ ఏజెన్సీకి అప్పగించామన్న ప్రధాని.. ఏడాది లోపే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ప్రసంగించారు.
జిహెచ్‌టిసి-ఇండియా ఛాలెంజ్ పథకం క్రింద నిర్మించే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తున్న 50 కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. అగర్తాలా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, చెన్నై, రాంచీ వంటి ఆరు ప్రదేశాలలో ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రధాని చెప్పారు. ఇండోర్‌లో ఉన్నవారికి ఇటుకలతో చేసిన గోడలు ఉండవని ఆయన అన్నారు. వీటి కోసం “ప్రీ-ఫాబ్రికేటెడ్ శాండ్‌విచ్ ప్యానెల్” వ్యవస్థ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రాజ్‌కోట్‌లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫ్రెంచ్ “ఏకశిలా కాంక్రీట్ నిర్మాణం” చేపడుతున్నామని మోడీ వెల్లడించారు.
యునైటెడ్ స్టేట్స్, ఫిన్లాండ్ నుండి ప్రీకాస్ట్ కాంక్రీట్ వ్యవస్థ చెన్నైలో ఉపయోగించబడుతుందన్న ప్రధాని.. రాంచీలో జర్మనీకి చెందిన 3-D నిర్మాణ వ్యవస్థ ఉపయోగిస్తున్నామన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన స్టీల్ ఫ్రేమ్ టెక్నాలజీ అగర్తాలాలో ఉపయోగించబడుతుంది. కెనడా నుండి సాంకేతిక పరిజ్ఞానంతో లక్నోలో నిర్మాణాలు చేపడుతామని మోదీ తెలిపారు.