Latest Crime News: ఇంట్లో ఎవరూ లేరని ఆ బాలిక బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రొమాన్స్ చేస్తోంది. అయితే సడన్‌గా తల్లి ఎంట్రీ ఇచ్చింది. అంతే ఆ బాలిక ఒక్కసారిగా భయంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్ పై అంతస్తు నుంచి దూకేసింది. అయితే ప్రాణాపాయం తప్పింది గానీ.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఇక ఈ ఘటన ఆర్ధిక నగరం ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక(17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తోంది. అయితే అంతలోనే ఆమె తల్లి రావడాన్ని ఆ బాలిక గమనించింది. ఎక్కడ తాను దొరికిపోతానన్న భయంతో.. ఆ బాలిక ఏకంగా మొదటి అంతస్తులో ఉన్న బెడ్‌రూమ్ కిటికి నుంచి అమాంతం దూకేసింది.
ఈ ఘటనతో షాక్‌కు గురైన యువకుడు అక్కడ నుంచి మెల్లిగా జారుకోగా.. తీవ్రగాయాలైన బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ప్రాణానికి ఏ ప్రమాదం లేదని తెలుస్తోంది. ఇక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడు సునీల్ జెండే(20)ను అదుపులోకి తీసుకున్నారు.
For More News:
మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?
‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..
ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్ ఫామ్‌తోనే జట్టులోకి..?
కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..
కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..
కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..