కరోనాతో చ‌నిపోయిన‌ వ్యక్తికి ఎమ్మెల్యే అంత్యక్రియలు

కరోనా రావ‌డ‌మే మ‌నిషికి పెద్ద శాపం. దానికి తోడు ప్ర‌జ‌లు చూపించే వివక్ష బాధితుల పాలిట ప్రాణ సంక‌టంగా మారుతోంది.

కరోనాతో చ‌నిపోయిన‌ వ్యక్తికి ఎమ్మెల్యే అంత్యక్రియలు
Ram Naramaneni

|

Aug 25, 2020 | 1:07 PM

కరోనా రావ‌డ‌మే మ‌నిషికి పెద్ద శాపం. దానికి తోడు ప్ర‌జ‌లు చూపించే వివక్ష బాధితుల పాలిట ప్రాణ సంక‌టంగా మారుతోంది. ఇక క‌రోనాతో చనిపోతే ఆ డెడ్‌బాడీకి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డానికి కుటుంబ స‌భ్యులు కూడా వెన‌కంజ వేస్తున్నారు. దీంతో ప్ర‌జాప్ర‌తినిధులు ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తాజాగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్ ముందుకు వ‌చ్చారు. స్థానిక గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో క‌రోనా ఓ వ్య‌క్తి చ‌నిపోగా, అత‌డికి అంత్య‌క్రియులు నిర్వ‌హించేందుకు కుటుంబ స‌భ్యులు కూడా ముందుకు రాలేదు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వ‌యంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం క‌రోనా మృతుల పట్ల వివ‌క్ష చూపొద్ద‌ని ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్ కోరారు కరోనాతో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని వివ‌రించారు.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu