ఈ పోస్టుకు కోటికి పైగా లైకులు, కోహ్లీ రికార్డ్‌

|

Aug 29, 2020 | 9:12 AM

విరుష్క జోడి ఇటీవ‌ల అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. 'తాము ఇద్దరం కాస్త త్వరలో ముగ్గురు కాబోతున్నాం' అని ఆగస్టు 27న ప్ర‌క‌టించారు.

ఈ పోస్టుకు కోటికి పైగా లైకులు, కోహ్లీ రికార్డ్‌
Follow us on

విరుష్క జోడి ఇటీవ‌ల అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ‘తాము ఇద్దరం కాస్త త్వరలో ముగ్గురు కాబోతున్నాం’ అని ఆగస్టు 27న ప్ర‌క‌టించారు. ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఓ సూప‌ర్ కూల్ ఫోటోను ఈ పోస్ట్‌కు జ‌తచేశారు. విరాట్ ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఈ ఫోటోకి ఏకంగా కోటికి పైగా లైకులు రావడం విశేషం. కేవలం ఒక్క పోస్టుకే ఇన్ని లైకులు సాధించిన, తొలి ఆసియా వ్య‌క్తిగా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందే 75 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ అందుకున్న మొద‌టి ఆసియన్​గానూ చ‌రిత్ర లిఖించాడు. (ఖేల్​రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు క‌రోనా పాజిటివ్)

ఐపీఎల్​ కోసం ప్రజంట్ దుబాయ్ వెళ్లాడు విరాట్‌. రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు సార‌థి​ అయిన కోహ్లీ.. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టి అభిమానుల‌కు ఆశ నెర‌వేర్చాల‌న పట్టుద‌ల‌తో ఉన్నాడు.సెప్టెంబరు 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది.

Also Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్​గా సీఎం జగన్​