గుడ్ న్యూస్ చెప్పిన ‘కేన్ మామ’.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు..హైదరాబాదీల స్పెషల్ విషెస్

|

Dec 16, 2020 | 4:15 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి సారా రహీమ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ ఇన్‌స్టా ద్వారా అభిమానులతో..

గుడ్ న్యూస్ చెప్పిన కేన్ మామ.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు..హైదరాబాదీల స్పెషల్ విషెస్
Follow us on

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి సారా రహీమ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందమైన చిన్నారి తల్లికి స్వాగతమంటూ బేబి కిడ్ ఫోటోను షేర్ చేశాడు. వెస్టిండిస్ టెస్ట్ మధ్యలోంచి మెటర్నిటీ సెలవులపై వెళ్లిన కేన్ మామ.. మొదటి బిడ్డతో మధుర క్షణాలు ఆస్వాదిస్తున్నాడు. ‘చిట్టితల్లి.. మా జీవితంలోకి.. అలాగే కొత్త ప్రపంచానికి స్వాగతం.. నీ రాక మా జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది.. ‘ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఇక గుడ్ న్యూస్ తెలిపిన కేన్ విలియమ్సన్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది. సోషల్ మీడియా వేదికగా మాజీ, సహచర ఆటగాళ్లు కేన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు.. కేన్ మామకు తమదైన రీతీలో అభినందనలు తెలుపుతున్నారు. కాగా తండ్రిగా ప్రమోషన్‌ అందుకున్న కేన్‌ విలియమ్‌సన్‌కు టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.