Breaking : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Breaking :  కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !
Follow us

|

Updated on: Oct 14, 2020 | 8:59 AM

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఏఎస్‌రావు నగర్‌లోని ఆయన నివాసంలో కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆయనను  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఏసీబీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్‌గా ప్రచారం జరిగింది. ( Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ )

రాంపల్లి ప్రాంతంలో 28 ఎకరాల భూ సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో ఈ లంచం తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు నాగరాజును పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో నాగరాజు అక్రమాలకు సంబంధించి మరిన్ని విషయాలు బయటపడ్డాయి.  పట్టా భూమి కోసం డబ్బులు అడిగిన విషయం వెలుగుచూసింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో కేసును నమోదు చేశారు. ( మరో రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అతి భారీవర్షాలు ! )