Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Follow us

|

Updated on: Oct 14, 2020 | 6:53 AM

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్థంభించింది. ఎగువ నుంచి కృష్ణానదికి  వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,31,484 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను  విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని.. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరింది వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. (హైదరాబాద్‌- విజయవాడ హైవే పైకి వదర నీరు)