ఆమె తమిళులకు ‘అమ్మ’..తెరపై ఆమెను చూపించే విధానంలో తేడా వస్తే తంబీలు తోలు తీసేస్తారు. ఇప్పటికే ఎవర్గ్రీన్ రమ్యకృష్ణ..తమిళనాడు మాజీ సీఎం జయలలిత పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పడు కంగనా రనౌత్ అగ్ని పరీక్షనే ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గౌతమ్ మీనన్ డైరక్షన్లో రమ్యకృష్ణ యాక్ట్ చేసిన ‘క్వీన్’ వెబ్‌సీరీస్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ వెబ్‌సీరీస్ చేశారు. జయలలిత పుట్టి పెరిగిన తీరు, ఆమె రాజకీయాల్లోకి రావడం వంటివన్నీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. జస్ట్ ఆడియన్స్‌ని మాత్రమే కాదు… సింగపూర్ ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది క్వీన్ వెబ్‌సీరీస్. ఈ సీరీస్ మొదలుపెట్టిన సేమ్ డే అవార్డు అనౌన్స్ కావడం చాలా హ్యాపీగా ఉందన్నారు రమ్యకృష్ణ. త్వరలోనే సెకండ్ సీజన్ షూటింగ్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చేశారు.
ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఆ క్వీన్‌కి ఆదరణ పెరిగే కొద్దీ సెట్స్ మీద ఉన్న ‘తలైవి’ సినిమా టీమ్‌కి టెన్షన్ పెరుగుతోందట. క్వీన్‌గా వెబ్‌సీరీస్‌తో రమ్య జనాల ఓటు అందుకున్నారు. మరి ఇప్పటికే పలు సందర్భాల్లో అమ్మ అభిమానుల మనసులను అంతగా అట్రాక్ట్ చేయలేకపోయిన కంగనా రనౌత్ పరిస్థితి ఏంటి? ఫొటోలతో, పోస్టర్లతోనూ చేయలేకపోయిన పనిని స్క్రీన్ మీద పెర్ఫార్మెన్స్ తో చేయగలుగుతారా? అమ్మ వీరాభిమానుల అంగీకారాన్ని పొందగలుగుతారా? ఇప్పుడు ఇదే కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ డిష్కసన్గా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read : ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు