ఈ క్రూరమృగం నాపై దాడి చేస్తుంది : కంగనా రనౌత్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన వాయిస్‌కు మరింత పదును పెట్టారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. అయితే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై మరోసారి నిప్పులు చెరిగారు...

ఈ క్రూరమృగం నాపై దాడి చేస్తుంది : కంగనా రనౌత్

Updated on: Sep 01, 2020 | 8:20 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన కత్తికి మరింత పదును పడుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై నిప్పులు చెరిగారు. సినీ మాఫియాకు సంబంధించి అసలు నేరస్తుడు కరణ్ జోహారేనని అంటూ మండిపడ్డారు. అనేకమంది జీవితాలను, కెరీర్లను నాశనం చేసిన తర్వాత కూడా అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అంటూ కాంమెంట్ చేశారు. అతడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకునేది జరిగే పనేనా? అంటూ సెటైర్ కూడా వేశారు. ఈ వ్యవహారం అంతా సద్దుమణిగాక కరణ్, క్రూరమృగాల వంటి  అతని గ్యాంగ్ సభ్యుల తనను టార్గెట్ చేస్తారంటూ తాాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

సుశాంత్ రాజ్ పుత్‌తో కలిసి జిమ్‌లో కసరత్తులు చేసే ఓ వ్యక్తి మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా పైవిధంగా స్పందించారు. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో బంధుప్రీతి అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us