ఏంటిది.! అంపైర్‌ను ధోని భయపెట్టాడా.?

ఐపీఎల్ 2020లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వల్ల అంపైర్ తన నిర్ణయాన్ని..

ఏంటిది.! అంపైర్‌ను ధోని భయపెట్టాడా.?
Follow us

|

Updated on: Oct 14, 2020 | 2:16 PM

ఐపీఎల్ 2020లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వల్ల అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని చెప్పాలి. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.  అసలు అదేంటో ఇప్పుడు చూద్దాం.. (IPL 2020)

నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అంపైర్ పాల్ రీఫెల్ తీసుకున్న నిర్ణయం అటు నెటిజన్లకు.. ఇటు క్రీడా విశ్లేషకులకు విస్మయాన్ని గురి చేసింది. ఆ ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్ రెండో బంతిని క్రీజ్‌కు దూరంగా వేశాడు. దాన్ని వైడ్‌గా ప్రకటించేందుకు కొంతవరకు తన చేతులను కూడా ఎత్తాడు అంపైర్ రీఫెల్.. అయితే అటు ధోని, ఇటు బౌలర్ ఠాకూర్ తమ అసహనాన్ని ప్రదర్శించడంతో వెంటనే తన అంపైర్ రీఫెల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎటు చూసినా ఆ బంతి వైడ్‌గానే అని తెలిసిపోతోంది. టీవీ రీప్లేలో కూడా ఇది స్పష్టమైంది.

దాదాపు 127 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన రీఫెల్.. ఆటగాళ్ల ఒత్తిడి వల్ల ఇలా తన నిర్ణయాన్ని మార్చుకోవడం కరెక్ట్ కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ అభిమానులు అయితే రీఫెల్‌కు అంపైరింగ్ నేర్పించాలని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఐపీఎల్ 2020: ఢిల్లీ వెర్సస్ ముంబై మ్యాచ్ ఫిక్స్ అయిందా.?

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు