IPL 2020, RCB vs KKR : అదరగొట్టిన ఆర్సీబీ ..చిత్తుగా ఓడిన కేకేఆర్

|

Oct 12, 2020 | 11:42 PM

ఐపీఎల్ తాజా సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంచి విజయాలతో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తూ విజయాల్ని ఒడిసిపడుతుంది.

IPL 2020, RCB vs KKR : అదరగొట్టిన ఆర్సీబీ ..చిత్తుగా ఓడిన కేకేఆర్
Follow us on

ఐపీఎల్ తాజా సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంచి విజయాలతో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తూ విజయాల్ని ఒడిసిపడుతుంది. సోమవారం రాత్రి షార్జా వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్‌పై ​ కోహ్లీసేన 82 పరుగుల తేడాతో బంఫర్ విక్టరీ నమోదు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 195 టార్గెట్ ఛేదనలో కోల్‌కతా పేకమేడలా కూలిపోయింది. భీకర ఫామ్‌లో ఉన్న బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(34: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) ఆ టీమ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(1)తో సహా మిగతా బ్యాట్స్‌మెన్‌ టామ్‌ బాంటన్‌(8), నితీశ్‌ రాణా(9), ఇయాన్‌ మోర్గాన్‌(8), ఆండ్రూ రస్సెల్‌(16) దారుణంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌(2/20), క్రిస్‌ మోరీస్‌(2/17) చెరో రెండు వికెట్లు తీశారు. చాహల్‌, ఉదాన, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీలకు ఒక్కో వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఏబీ డివిలియర్స్‌(73 నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు బెంగళూరు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆర్సీబీ ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అరోన్‌ ఫించ్‌(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించింది. దాటిగా ఆడుతున్న దాటిగా ఆడుతున్న పడిక్కల్‌ (32) రసెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఫించ్‌(47) కూడా బౌల్డై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోహ్లి(33 నాటౌట్‌; 28 బంతుల్లో 1 ఫోర్‌) సహకారంతో డివిలయర్స్ డెత్ ఓవర్లలో చెలరేగిపోయాడడు. పోర్లు,సిక్స్‌లతో ఆకాశమే హద్దుగా ఆడాడు.