‘టాప్‌’కు ఎగబాకిన ముంబై.. డీలాపడ్డ హైదరాబాద్..

|

Oct 04, 2020 | 7:47 PM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో ‘టాప్‌’ ప్లేస్‌కు ఎగబాకింది.

టాప్‌కు ఎగబాకిన ముంబై.. డీలాపడ్డ హైదరాబాద్..
Follow us on

IPL 2020: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో ‘టాప్‌’ ప్లేస్‌కు ఎగబాకింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

డికాక్ (39 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా… ఇషాన్ కిషన్(31), హార్దిక్(28), పొలార్డ్(25) మరోసారి ఆకట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(60) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించగా.. బెయిర్‌స్టో (25), మనీష్ పాండే(30) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్(2/28), పాటిన్సన్(2/29), బుమ్రా(2/41) రాణించారు.