కేంద్రమంత్రికి ఇండిగో షాక్

ఇండిగో విమాన ప్రయాణికులకు సమస్యలు తప్పటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపెడుతూనే ఉంది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీకి కూడా ఇండిగో షాక్ ఇచ్చింది. నాగ్ పూర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడంలో విఫలమైంది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని టేకాఫ్ చేయకుండానే వెనక్కి మళ్లించారు. నాగ్ పూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న ఇండిగో విమానం 6ఇ 636లో టేకాఫ్ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 12:29 pm, Tue, 13 August 19
కేంద్రమంత్రికి ఇండిగో షాక్

ఇండిగో విమాన ప్రయాణికులకు సమస్యలు తప్పటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపెడుతూనే ఉంది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీకి కూడా ఇండిగో షాక్ ఇచ్చింది. నాగ్ పూర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడంలో విఫలమైంది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని టేకాఫ్ చేయకుండానే వెనక్కి మళ్లించారు. నాగ్ పూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న ఇండిగో విమానం 6ఇ 636లో టేకాఫ్ కు కొద్ది క్షణాల ముందు లోపం గుర్తించి పైలెట్ ను అప్రమత్తం చేశారు. దీంతో పైలెట్ టేకాఫ్ ను నిలిపివేసి విమానాన్ని తిరిగి వెనక్కు తీసుకువచ్చారు.