First In World To Get Covid Vaccine: బ్రిటన్ లో భారత సంతతి జంటకు తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్.

| Edited By: Pardhasaradhi Peri

Dec 08, 2020 | 8:59 PM

బ్రిటన్ లో 87 ఏళ్ళ హరి శుక్లా, 83 ఏళ్ళ ఆయన  భార్య రంజన్ వరల్డ్ లో తొలి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉన్నారు. భారత సంతతికి చెందిన వీరికి న్యూకేజిల్ లోని ఓ ఆసుపత్రిలో రెండు డోసుల ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను..

First In World To Get Covid Vaccine: బ్రిటన్ లో భారత సంతతి జంటకు తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్.
Follow us on

బ్రిటన్ లో 87 ఏళ్ళ హరి శుక్లా, 83 ఏళ్ళ ఆయన  భార్య రంజన్ వరల్డ్ లో తొలి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉన్నారు. భారత సంతతికి చెందిన వీరికి న్యూకేజిల్ లోని ఓ ఆసుపత్రిలో రెండు డోసుల ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను ఇచ్చారు. మొదట ఈ జంటను నేషనల్ హెల్త్ సర్వీస్ కాంటాక్ట్ చేసి వారి అనుమతిని తీసుకుంది. 80 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తికీ మొదట టీకామందును ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జంట ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి జంట అయిందని ఈ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక దశలవారీగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తాము ప్రపంచంలో తొలి విడత టీకామందును తీసుకున్నందుకు సంతోషంగా ఉందని హరి శుక్లా, రంజన్ వ్యాఖ్యానించారు.

ఫైజర్ వ్యాక్సిన్ ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయవలసి ఉంటుంది. యూకే లో ఈ టీకామందును ఇచ్చెందుకు 50 ఆసుపత్రులను ఎంపిక చేశారు. రానున్న నెలల్లో మరిన్ని హాస్పటల్స్ ను సెలెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఇండియాలో తమ టీకామందును పంపిణీ చేసేందుకు అనుమతించాల్సిందిగా ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.