మూడో టెస్టు మ్యాచ్: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నటరాజన్‌కు దక్కని చోటు..

|

Jan 06, 2021 | 1:26 PM

India Vs Australia 2020: రేపటి నుంచి సిడ్నీ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు తుది జట్టును యధావిధిగా ఒక్క రోజు ముందుగానే ప్రకటించింది...

మూడో టెస్టు మ్యాచ్: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నటరాజన్‌కు దక్కని చోటు..
Follow us on

India Vs Australia 2020: బాక్సింగ్ డే టెస్టు గెలుపుతో జోరు మీదున్న టీమిండియా మూడో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి సిడ్నీ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు తుది జట్టును యధావిధిగా ఒక్క రోజు ముందుగానే ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని రోహిత్ శర్మ.. మూడో టెస్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇక తొలి రెండు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా విఫలమైన మయాంక్ అగర్వాల్‌కు జట్టు యాజమాన్యం ఉద్వాసన పలికింది. అటు గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమైనా ఉమేష్ యాదవ్ స్థానాన్ని 28 ఏళ్ల నవదీప్ సైనీ భర్తీ చేయనున్నాడు. ఈసారి తుది జట్టులో నటరాజన్‌కు చోటు దక్కలేదు. గిల్‌తో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. వన్‌డౌన్‌లో పుజారా, ఆ తర్వాత రహనే, నెక్స్ట్ హనుమ విహారి మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉంది.

టీమిండియా జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్‌), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, నవదీప్ సైనీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

Also Read:

కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!