
స్విస్‌బ్యాంక్‌ల్లో నల్లధనం గుట్టు భారత్‌కు మరోసారి చేరింది. స్విస్ ఖాతాలకు సంబంధించిన రెండో జాబితా భారత ప్రభుత్వానికి అందింది. ఖాతాలకు సంబంధించి స్విస్ బ్యాంకులతో భారత ప్రభుత్వం చేసుకున్న చేసుకున్న ఒప్పందంతో ఈ జాబితా కేంద్రానికి అందింది. 2019లో తొలిజాబితాను భారత ప్రభుత్వినికి అందచేశాయి స్విస్‌బ్యాంకులు.
86 దేశాలకు చెందిన 31 లక్షల మంది ఖాతాలు స్విస్‌బ్యాంకుల్లో ఉన్నాయి. పన్ను ఎగవేత తదితర ఆర్ధికనేరాలకు సంబంధించి 100 మందికి పైగా భారత్‌కు చెందిన ఖాతాదారులు వివరాలను కేంద్రానికి అందించారు స్విస్ అధికారులు. భారత్‌కు చెందిన చాలామంది వ్యాపారవేత్తలు స్విస్ బ్యాంక్‌లతో పాటు పనామా , బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్ , కేమాన్ ఐల్యాండ్స్ నల్లదనాన్ని దాచినట్టు ఆరోపణలు వచ్చాయి.
స్విస్ బ్యాంక్‌లో డబ్బు దాచుకున్న వాళ్ల అడ్రస్ , పేరు , ఫోన్ నెంబర్ , ట్యాక్స్ వివరాలు కూడా భారత ప్రభుత్వానికి అందాయి. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న భారతీయులు స్వదేశంలో విధిగా పన్నులు చెల్లించారా ? అన్న విషయంపై కేంద్రం దర్యాప్తు చేస్తుంది. వచ్చే ఏడాది మరోసారి భారతీయుల జాబితాను కేంద్రానికి ఇస్తుంది స్విస్ ప్రభుత్వం.