India Full Schedule 2021: 2020 క్రీడారంగానికి ఓ పీడకల. కరోనా కారణంగా ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు ఆగిపోయాయి. అత్యంత ధనిక లీగ్ ఐపీఎల్ కూడా ఓ తరుణంలో వాయిదా పడాల్సి ఉండగా.. బయోబబుల్ వాతావరణంలో బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహించింది. ఇదిలా ఉంటే గతేడాది ఎండింగ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడమే కాకుండా టెస్టుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసుకుంది. అయితే బాక్సింగ్ డే టెస్టులో పుంజుకుని అపూర్వ విజయాన్ని అందుకుంది. ఫుల్ జోష్‌తో 2021ను వెల్‌కమ్ చెప్పింది. ఇక ఈ ఏడాదిలో కూడా టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది.