ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజే ఒక్కరోజే 853 మంది మృతి !

భారత్​లో కరోనా ఆందోళ‌న క‌రంగా వ్యాపిస్తోంది. ప్ర‌మాద‌క‌రంగా రోజూ 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజే ఒక్కరోజే 853 మంది మృతి !
Follow us

|

Updated on: Aug 02, 2020 | 11:26 AM

Coronavirus In India : భారత్​లో కరోనా ఆందోళ‌న క‌రంగా వ్యాపిస్తోంది. ప్ర‌మాద‌క‌రంగా రోజూ 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 54 వేల 736 కేసులు న‌మోద‌య్యాయి. మరో 853 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం కేసులు 17 లక్షల 50 వేలు దాటాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేటి బులిటెన్ విడుద‌ల చేసింది.

దేశంలో మొత్తం న‌మోదైన క‌రోనా కేసులు 17,50,724 ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 5,67,730 వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 11,45,629 కోవిడ్ కార‌ణంగా దేశంలో చ‌నిపోయిన‌వారు 37364

దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో ఎక్క‌వ‌గా మహారాష్ట్ర, తమిళనాడులోనే చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 300 మంది కరోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కూడా 265 మంది చ‌నిపోయారు. కాగా మహారాష్ట్రలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 15,300కు చేరింది. తమిళనాడులోనూ నిన్న ఒక్కరోజే దాదాపు 90 మంది చ‌నిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4000 దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Read More : తెలంగాణ కరోనా తాజా బులిటెన్ :జిల్లాల వారీగా కేసులు