ఇండియాలో ఒక్కరోజే 84 వేల కేసులు

|

Sep 03, 2020 | 3:31 PM

ఇండియాలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. అన్ లాక్ వెసులుబాట్లు అమల్లోకి వస్తున్నవేళ భారత్ లో కరోనా కేసులు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగిపోతున్నాయి. ఒక్క రోజు అత్యధిక కేసుల నమోదులో..

ఇండియాలో ఒక్కరోజే 84 వేల  కేసులు
Follow us on

ఇండియాలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. అన్ లాక్ వెసులుబాట్లు అమల్లోకి వస్తున్నవేళ భారత్ లో కరోనా కేసులు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగిపోతున్నాయి. ఒక్క రోజు అత్యధిక కేసుల నమోదులో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 83,883 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరాయి. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై గణాంకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1043 మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376 మంది మరణించారు. ఇక, ఇప్పటివరకు 29,70,492 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8 లక్షల 15 వేల 538 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.09 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో 1.75 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,72,179 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆయా రాష్ట్రాలు అందించిన లెక్కలు బట్టి తెలుస్తోంది.