IND Vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు.. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. ఈ షాక్ నుంచి తేరుకునేలోపు కోహ్లీసేనకు మరో షాక్ తగిలింది. టీమిండియాకు వరుస జరిమానాలు తప్పట్లేదు. ఇప్పటికే చివరి రెండు టీ20లకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫీజులో కోతను ఎదుర్కున్న భారత్ మరోసారి అదే తప్పిదాన్ని చేసింది.
టీ20ల్లో ఒకసారి 40 శాతం.. మరోసారి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదురుకున్న టీమిండియాకు ఈసారి ఏకంగా ఆటగాళ్ల ఫీజులో నుంచి 80 శాతం జరిమానా పడింది. అనుకున్న గడువులోపు కోహ్లీసేన నాలుగు ఓవర్లు తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ గుర్తించి విచారణ జరపగా.. ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున మొత్తం 80 శాతం ఫీజును జరిమానాగా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తప్పుని అంగీకరించడంతో దీనిపై తదుపరి విచారణ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
Tough day at the office but we hope to come back strong next ODI ???? #TeamIndia #NZvIND pic.twitter.com/CzOfPrVEBF
— BCCI (@BCCI) February 5, 2020