Andhra Pradesh: ఏపీలోనే ఆ బావిలో నీళ్లు తాగితే కవలలు పక్కా..

ఆ బావి కారణంగా ఇప్పుడు ఆ ఊరు ఫేమస్. ఆ బావిలో అంతగా ఏముంది అంటారా..? ఈ నీళ్ల వల్ల సంతానం కలుగుతుందన్న ప్రచారం ఉంది. అది కూడా ఏకంగా కవలలు పుడతారట. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ బావి నీటి కోసం నిత్యం జనం క్యూ కడుతుంటారు. ఆ బావి డీటేల్స్ తెలుసుకుందాం...

Andhra Pradesh: ఏపీలోనే ఆ బావిలో నీళ్లు తాగితే కవలలు పక్కా..
Image Credit source: BBC
Follow us

|

Updated on: Apr 24, 2024 | 12:57 PM

అది తూర్పుగోదావ‌రి జిల్లా రంగంపేట మండ‌లం దొడ్డిగుంట గ్రామం. ఆ ఊర్లోని బావి చాలా ఫేమస్. ఎందుకంటే.. ఆ బావిలోని నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారన్న ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్లి ఇప్పటికీ ఆ బావిలో నీళ్లు తాగుతున్నారు. మాములుగా ఏదైనా ఊర్లో అరుదుగా కవలలు క‌నిపిస్తుంటారు. కానీ, దొడ్డిగుంటలో మాత్రం ఏ ఇంటి తలుపు తట్టినా.. కవలలే కనిపిస్తారు. గ్రామంలో.. 130 దాకా కవలలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అందుకు ఆ భావి నీరే కారణమని కూడా అంటున్నారు. వార్తా ఛానళ్లు, పేపర్లు, సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ప్రచారం అవ్వడంతో.. ఆ ప్రాంతానికి నిత్యం ఎంతోమంది వచ్చి.. నీళ్లు తాగి.. టిన్నులతో తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి వాటిపై నమ్మకం లేనివారు కూడా ప్రయత్నిస్తే పోయేది ఏముంది అక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నారు. విదేశాల్లో ఉండేవారు సైతం ఈ నీటిని అక్కడికి దిగుమతి చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

మరో విశేషం ఏంటంటే.. ఆ బావి నీళ్లు తాగిన రోగాలు కూడా నయమవుతాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే ఊర్లో కుళాయిలు ఉన్నా.. చాలామంది  బావి నీళ్లే తాగుతున్నారు. పిల్లలు పుట్టడంలో జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని, ఇదంతా ట్రాష్ అని వైద్యులు ఈ నమ్మకాలను కొట్టివేస్తున్నారు.  నీటి వ‌ల్ల పిల్లలు పుడతార‌న్న ప్రచారంలో నిజం లేదని జ‌న‌విజ్ఞాన వేదిక వాళ్లు కూడా చెబుతున్నారు. అది కేవలం కేవ‌లం నమ్మకం మాత్రమేనని.. శాస్త్రీయ‌త లేదని చెబుతున్నారు.వైజాగ్,హైదరాబాద్‌లోని అనేక ల్యాబ్స్‌లో ఇక్కడి నీటిని టెస్ట్ చేయించారు. కానీ ప్రత్యేకత ఏం కనిపించలేద. నిపుణులు ఏం చెబుతున్నప్పటికీ.. ఆ బావి వద్దకు వచ్చేవారి.. సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

(ఇది కేవలం అక్కడ ఏం జరుగుతంది అనే సమాచారాన్ని చేరవేసే ప్రయత్నమే. టీవీ9 మూఢనమ్మకాలను ప్రొత్సహించదు)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..