ICC New Award: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ప్రతీ నెలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్(మెన్, ఉమెన్)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ చేయనుండగా.. వారి ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నారు.
కాగా, ఈ సరికొత్త అవార్డు రేసులో జనవరి నెలకు గానూ మన ఇండియన్ ప్లేయర్స్ ఐదుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌తో పాటు అశ్విన్ పేర్లను పరిశీలిస్తున్నారు. అటు జోరూట్(ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), మరిజన్నే కాప్(దక్షిణాఫ్రికా) పేర్లను సైతం ఐసీసీ పరిశీలిస్తోంది.
Also Read:
ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్.. ఆక్షన్‌లోకి 55 మంది ఆటగాళ్లు.. ఆ జట్టులోకి స్టీవ్ స్మిత్.?
బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..