విషాదం : అమెరికాలో ఈత‌కు వెళ్లి హైద‌రాబాద్ యువ‌కుడు‌ మృతి

హైయ్య‌ర్ స్ట‌డీస్ కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అర్ధాంతరంగా త‌నువు చాలించాడు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో ఈ విషాద‌ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

విషాదం : అమెరికాలో ఈత‌కు వెళ్లి హైద‌రాబాద్ యువ‌కుడు‌ మృతి

Updated on: Sep 04, 2020 | 1:15 PM

హైయ్య‌ర్ స్ట‌డీస్ కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అర్ధాంతరంగా త‌నువు చాలించాడు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో ఈ విషాద‌ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌కు చెందిన ఖాజా ఇమ్రాన్ ఖాన్ (23) అనే వ్య‌క్తి ఆట‌విడుపు కోసం సెయింట్ లూయిస్‌లోని సరస్సులో ఈతకు వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తూ మునిగిపోయాడు. వెంట‌నే ఫ్రెండ్స్‌ అతడిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించినా ఫలితం ద‌క్క‌లేదు. రెస్క్యూ టీమ్‌కు స‌మాచారం ఇవ్వ‌గా వ‌చ్చి డెడ్‌బాడీని బయటకు తీశారు. దీంతో ఖాజా కుటుంబంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. కోవిడ్ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు ఉండ‌టం, మృత‌దేహాన్ని ఇండియాకు తెచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జ‌రిగే అవ‌కాశం ఉంది. కాగా, అమెరికాకు వెళ్లేందుకు త‌మ‌కు ఎమర్జెన్సీ వీసా ఇప్పించాలని ఖాజా పేరెంట్స్ గ‌వ‌ర్న‌మెంట్‌ను కోరారు.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !

తెలంగాణ మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్

Follow Us