వాట్సాప్ అడ్మిన్లకు బ్యాడ్ న్యూస్. ఇకపై హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫోటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో హింసను ప్రేరేపించే వీడియోలు పెడితే ఆ గ్రూప్స్ అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడో ఇతర దేశాల్లో జరిగే హింసకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారని దాని వల్ల నగరంలోని శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా వాట్సాప్ వీడియోలు, సందేశాలపై పోలీసు శాఖ పూర్తిగా నిఘా పెట్టిందని యువతకు స్పష్టం చేశారు.
Dear Citizens,
An unmindful act of forwarding a fake news or videos brings a law abiding citizen into unnecessary fear. It is also a crime in the eyes of law.
All WhatsApp group administrators are liable for legal action for forwarding such videos which affects communal harmony.— Anjani Kumar, IPS (@CPHydCity) August 17, 2019