హైదరాబాద్ బంజారాహిల్స్ లో హవాలా సొమ్మును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ 12 లో ఓ కారులో నలుగురు వ్యక్తులు డబ్బులను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో 3 కోట్ల 75 లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సొమ్ము తరలిస్తున్న ఈశ్వర్ దిలీప్, హరీష్ రామ్ బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ ను అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు. అయితే, ఈ డబ్బులు ఎక్కడ నుండి తీసుకొచ్చారు, ఎక్కడ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ హవాలా డబ్బుతో పాటు నిందితులను ఆదాయపన్ను శాఖ కు అప్పగిస్తున్నామని.. ఈ కేసును ఇన్ కం ట్యాక్స్ వాళ్లు విచారించిన తరువాత మరి కొన్ని విషయాలు బయట పడే అవకాశం ఉందని అంజనీకుమార్ చెప్పారు.