జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

గ్రేటర్ హైదరాబాద్‎లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ కొనసాగుతోంది. గురువారం మ‌ధ్నాహ్నాం 4053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ట డిమాండ్ 3471 మెగావాట్లు మాత్ర‌మే ఉండేది. గ‌త ఏడాదితో పోల్చితే ప్ర‌స్తుతం 582 మెగ‌వాట్ల విద్యుత్తు డిమాండ్ పెరిగిన‌ప్ప‌టికీ విద్యుత్తు అధికారులు ఏలాంటి అంత‌రాయం లేకుండ నిరంత‌రం స‌ర‌ఫ‌రా చేశారు.

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
Power Suppley
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 19, 2024 | 12:51 PM

గ్రేటర్ హైదరాబాద్‎లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ కొనసాగుతోంది. గురువారం మ‌ధ్నాహ్నాం 4053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ట డిమాండ్ 3471 మెగావాట్లు మాత్ర‌మే ఉండేది. గ‌త ఏడాదితో పోల్చితే ప్ర‌స్తుతం 582 మెగ‌వాట్ల విద్యుత్తు డిమాండ్ పెరిగిన‌ప్ప‌టికీ విద్యుత్తు అధికారులు ఏలాంటి అంత‌రాయం లేకుండ నిరంత‌రం స‌ర‌ఫ‌రా చేశారు. అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖకు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఈ సంద‌ర్భంగా అభినందనలు తెలిపారు. రాబోవు మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశమున్నందున, విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ, ఇదే విధంగా సేవలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు.

రాష్ట్రంలో గ‌త ఏడాది.. ప్ర‌స్తుత ఏడాది విద్యుత్తు స‌ర‌ఫ‌రా వివ‌రాలు..

  • March 2023 average demand 13966 MW, consumption 274.42 MU
  • April 2023 average demand 11781 MW, Consumption 233.06 MU
  • March 2024 average demand 14534 MW, consumption 289.71 MU
  • April 2024 average demand 12429 MW, consumption 256.11 MU

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..