జల దిగ్బంధంలో హైదరాబాద్

ఎడతెరిపిలేని వర్షాలతో  భాగ్యనగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో వరదనీరు పోటెత్తుతుంది.

జల దిగ్బంధంలో హైదరాబాద్
Follow us

|

Updated on: Oct 14, 2020 | 9:15 AM

ఎడతెరిపిలేని వర్షాలతో  భాగ్యనగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో వరదనీరు పోటెత్తుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఖైరతాబాద్, చింతల్‌బస్తీ, గాంధీనగర్‌, మారుతీనగర్‌, శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్, యూసఫ్ గూడ, బి.ఎన్‌.రెడ్డి గాంధీనగర్‌ హయత్‌నగర్‌ ప్రాంతాలలో భారీగా వరదనీరు నిలిచింది. ముంపుతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది.  జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. సిటీలోని చాలాచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 32.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

సిటీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు :

హయత్‌నగర్‌లో 29.8, హస్తినాపురంలో 28.4 సెం.మీ వర్షపాతం

అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26.6, ఇబ్రహీంపట్నంలో 25.7 సెం.మీ వర్షపాతం

సరూర్‌నగర్‌లో 27.35, ఉప్పల్‌లో 25.6 సెం.మీ వర్షపాతం నమోదు

ముషీరాబాద్‌లో 25.6 సెం.మీ, బండ్లగూడలో 23.9 సెం.మీ వర్షపాతం

మేడిపల్లిలో 24.2 సెం.మీ, బాలానగర్‌లో 23.1 సెం.మీ వర్షపాతం

సికింద్రాబాద్‌లో 23.2 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 22.6 సెం.మీ వర్షపాతం

అత్యవసర ఫోన్ నంబర్లు

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన నంబర్లు 1912, 100

విద్యుత్‌శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు: 73820 72104, 73820 72106, 73820 71574

అత్యవసర సేవల కోసం సంప్రదించాల్సిన నంబర్‌ 040-2111 11111

జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణశాఖ నంబరు: 90001 13667

జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్ల నరికివేత సిబ్బంది నంబరు: 63090 62583

జీహెచ్‌ఎంసీ విద్యుత్‌శాఖ నంబరు: 94408 13750

Also Read :

Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Breaking : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !