‘బుర్ర జిమ్‌ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ ఎలా…!?

|

Jul 10, 2020 | 9:22 PM

లాక్‌డౌన్‌ కారణంగా జనాలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరి జీవితాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆఫీస్‌కు వెళ్లే పని లేదు.. సినిమా ప్రముఖులకు షూటింగ్‌లు లేవు. దాంతో ఫిట్‌నెస్‌ ప్రేమికులు కూడా కొన్ని రోజుల పాటు శరీరానికి రెస్ట్‌ ఇచ్చేశారు. పాపం రామ్‌ చరణ్‌ కూడా అలానే చేశారంట. దాదాపు రెండు నెలపాటు గ్యాప్‌ రావడంతో ప్రస్తుతం జిమ్‌ చేయాలంటే శరీరం సహకరించడం లేదట. బద్దకం ఎక్కువయ్యిందంటూ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ […]

‘బుర్ర జిమ్‌ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ ఎలా...!?
Follow us on

లాక్‌డౌన్‌ కారణంగా జనాలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరి జీవితాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆఫీస్‌కు వెళ్లే పని లేదు.. సినిమా ప్రముఖులకు షూటింగ్‌లు లేవు. దాంతో ఫిట్‌నెస్‌ ప్రేమికులు కూడా కొన్ని రోజుల పాటు శరీరానికి రెస్ట్‌ ఇచ్చేశారు.

పాపం రామ్‌ చరణ్‌ కూడా అలానే చేశారంట. దాదాపు రెండు నెలపాటు గ్యాప్‌ రావడంతో ప్రస్తుతం జిమ్‌ చేయాలంటే శరీరం సహకరించడం లేదట. బద్దకం ఎక్కువయ్యిందంటూ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు రామ్‌ చరణ్‌.

‘బుర్ర జిమ్‌ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ అంటూ చరణ్ షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం మస్త్  వైరలవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపసనా, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో వంట చేయడంతో పాటు ఇతర ఇంటి పనులను చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు చెర్రి.