సీతు పాప అడ్వెంచర్ చూశారా…

|

Aug 13, 2020 | 7:06 PM

తాజాగా సితార త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఔట్ డోర్ అడ్వెంచ‌ర్స్ మిస్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది.

సీతు పాప అడ్వెంచర్ చూశారా...
Follow us on

లిటిల్ ప్రిన్స్‌ సితార.. నెటిజన్లందరికీ సుపరిచితమైన పేరు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న కిడ్. ఇలా ఎంత చెప్పినా అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల ప‌ట్టి సీతు పాప గురించే..

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో సందడిగా గడుపుతున్నారు. అయితే వారి పిల్లల ఆట, పాటలన్నీ ఇంట్లోనే సాగుతున్నాయి. కరోనా ప్రభావం ఉండటంతోపాటు.. క్లాస్ రూమ్ ఇంటికే మారిపోయింది. పిల్లలు కూడా ఫీల్ అవుతున్నారు. తాజాగా సితార త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఔట్ డోర్ అడ్వెంచ‌ర్స్ మిస్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది.

ఇంట్లోనే అడ్వెంచ‌ర్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రించింది. సితార ఏ అండ్ ఎస్ పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి దాని ద్వారా అనేక విష‌యాల‌ని నెటిజ‌న్స్‌కి తెలియ‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే.