పాండ్యా ఫ్యామిలీలో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెల్సా..?

క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. స‌హ‌చ‌రుల గురించి, త‌న గురించి ఏదో ఒక‌టి పోస్ట్ చేస్తూ అల్ల‌రి చేస్తూనే ఉంటాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ను పోస్టు చేశాడు ఈ భార‌త ప్లేయ‌ర్.

పాండ్యా ఫ్యామిలీలో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెల్సా..?

Updated on: Jul 17, 2020 | 4:54 PM

క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. స‌హ‌చ‌రుల గురించి, త‌న గురించి ఏదో ఒక‌టి పోస్ట్ చేస్తూ అల్ల‌రి చేస్తూనే ఉంటాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ను పోస్టు చేశాడు ఈ భార‌త ప్లేయ‌ర్. త‌న ప్రేయ‌సి నటాషా స్టాంకోవిక్‌‌తో దిగిన ఆ ఫోటోను అప్‌లోడ్ చేశాడు. ఆ పిక్‌లో న‌టాషాతో పాటు మ‌రో మూడు బుజ్జి కుక్క పిల్ల‌లు కూడా ఉన్నాయి. ఇక పాండ్యా కాళ్ల‌‌పై న‌ట‌షా వాలిపోగా.. అత‌డు ఓ కుక్క పిల్ల‌ను కిస్ చేస్తూ క‌నిపించాడు.

ఆ ఫోటోకు ఫ్యామిలీ అంటూ ట్యాగ్ లైన్ పెట్టాడు ఈ క్రేజీ ఆల్‌రౌండ‌ర్‌. కాగా పాండ్యా గ‌ర్ల్‌ఫ్రెండ్ న‌టాషా ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టిన నిశ్చితార్థం చేసుకున్న పాండ్యా.. త‌మ‌కు బేబీ పుట్ట‌బోతున్న‌ట్లు మే నెల‌లో అనౌన్స్ చేశాడు. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లిపీట‌లెక్క‌బోతున్నారు.