రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి తన జట్టు ఫిట్ నెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీంలోని ఆటగాళ్లంతా ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నారని ప్రాక్టీస్ కూడా ఇరగదీస్తున్నారని సంబరపడిపోతున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాఉంటే, బౌలింగ్ సెషన్ ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీ తన టీంతో చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమ్ లీడర్ కోహ్లీ తన ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తున్న తీరు అతని కెప్టెన్సీ ప్రతిభకు అద్దం పట్టేలా సదరు వీడియో ఉందంటూ తెగ కామెంట్లు చేస్తు్న్నారు క్రికెట్ అభిమానులు. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే పేపర్‌పై బలంగా కనిపించే ఈ జట్టు అసలు ఆటలో మాత్రం చతికిలపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన 12 సీజన్లలో ఒక్కసారి కూడా ఆర్‌సీబీ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్‌తో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఈసారి ఏం చేస్తుందోనన్నది అభిమానులకు పెద్ద ప్రశ్నగా మారింది.
Our bowling coach, Adam Griffith, comes up with a fun and challenging competition to help our bowlers fire in those yorkers.
Safe to say all our bowlers are sharpshooters! ? ?#PlayBold #IPL2020 #WeAreChallengers pic.twitter.com/Nkjv97aQZc— Royal Challengers Bangalore (@RCBTweets) September 13, 2020