కశ్మీర్‌పై మరోసారి తలతిక్క కామెంట్లు చేసిన టర్కీ అధ్యక్షుడు

టర్కీ అధ్యక్షుడు రీసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి కశ్మీర్‌పై అడ్డదిడ్డంగా వాగారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల భాగంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తన వర్చువల్‌ సందేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు.

కశ్మీర్‌పై మరోసారి తలతిక్క కామెంట్లు చేసిన టర్కీ అధ్యక్షుడు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 11:43 AM

టర్కీ అధ్యక్షుడు రీసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి కశ్మీర్‌పై అడ్డదిడ్డంగా వాగారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల భాగంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తన వర్చువల్‌ సందేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ద‌క్షిణ ఆసియాలో శాంతికి క‌శ్మీర్ స‌మ‌స్య కీల‌క‌మ‌ని, అది ఇంకా ర‌గులుతూనే ఉన్న‌ద‌ని, క‌శ్మీర్‌లో 370 ఆర్టిక‌ల్ ర‌ద్దుతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా త‌యారైంద‌ని ఆరోపించారు.. యూఎన్‌ ఆదేశాలకు అనుగుణంగా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అక్కడికేదో యూఎన్‌ బాబ్బాబు కశ్మీర్‌ సమస్యను మీరు పరిష్కరించాలి అని బతిమాలినట్టుగా బిల్డప్‌ ఇచ్చుకున్నారు. అయితే కశ్మీర్‌పై ఎర్డోగాన్‌ చేసిన తలతిక్క వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది.. యూఎన్‌లో భార‌త ప్ర‌తినిధిగా ప‌నిచేస్తున్న‌ ‌తిరుమూర్తి త‌న ట్విట్ట‌ర్‌లో ఎర్డ‌గోన్‌ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని టర్కీ తెలుసుకుంటే మంచిదని హితవు చెప్పారాయన. యూఎన్‌లో మాట్లాడాలనుకుంటే సొంత పాలసీలపై ఎంతైనా మాట్లాడుకోవచ్చని తిరుమూర్తి టర్కీకి హెచ్చరికలతో కూడిన సలహా ఇచ్చారు. పాకిస్తాన్‌తో దోస్తానా ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఇంతకు ముందు కూడా కశ్మీర్‌పై అవాకులు చవాకులు పేలారు.. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కూడా పిచ్చి కామెంట్లు చేశారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఇందులో వేరొకరి జోక్యం అవసరం లేదని భారత్‌ చాలా సార్లు స్పష్టం చేసింది…

Latest Articles
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు