‘జోకర్’ దెబ్బకు 11 యాప్‌లపై బ్యాన్

|

Jul 10, 2020 | 10:07 PM

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది గూగుల్ సంస్థ. తన యూజర్ల భద్రతకు సవాల్ గా మారుతున్న మాల్వేర్ పై....

జోకర్ దెబ్బకు 11 యాప్‌లపై బ్యాన్
Follow us on

Google bans 11 MORE Android apps : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది గూగుల్ సంస్థ. తన యూజర్ల భద్రతకు సవాల్ గా మారుతున్న మాల్వేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది గూగుల్. మాల్వేర్ కలిగి ఉన్న 11 యాప్ లపై కొరడా ఝులిపించింది.

ఈ యాప్ లలో ప్రమాదకర ‘జోకర్’ మాల్వేర్ ఉండడమే గూగుల్ తీసుకున్న నిర్ణయానికి కారణం. ‘జోకర్’ మాల్వేర్ ఉన్న యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల ప్రమేయం లేకుండానే సిస్టమ్ లోని డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయి.

ప్రీమియం సర్వీసులను కూడా తనంత తానుగా సబ్ స్క్రైబ్ చేసుకుని యూజర్లను దిగ్భ్రాంతికి గురిచేయడం ‘జోకర్’ మాల్వేర్ స్పెషాలిటి. గూగుల్ బ్యాన్ చేసిన 11 యాప్ ల వివరాలు ఇవిగో.. వాటి లిస్ట్ కింద ఉందు చూడండి…

com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.relax.relaxation.androidsms
com.cheery.message.sendsms
com.cheery.message.sendsms
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.LPlocker.lockapps
com.remindme.alr
com.training.memorygame