AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ

పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ

Phani CH
|

Updated on: Jul 01, 2026 | 6:58 PM

Share

వరంగల్ జిల్లాలో పంట పొలం దున్నుతుండగా పురాతన బంగారు ఆభరణాలు బయటపడటంతో సంచలనం నెలకొంది. దొరికిన నిధులపై కౌలు రైతు, భూమి యజమాని, మాజీ యజమాని మధ్య వివాదం చెలరేగింది. ఈ ప్రాంతం కాకతీయుల కాలం నాటి అవశేషాలతో సంబంధం ఉందనే ప్రచారం కూడా ఊపందుకోవడంతో పొలంపై స్థానికుల ఆసక్తి పెరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ పంట పొలంలో పండేది పంట కాదు.. పసిడి! అవును, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఒక పొలం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే రైతుకు ఉన్న 6 ఎకరాల భూమిని బాలు అనే కౌలు రైతు సాగు చేస్తున్నాడు. ఇటీవల పంట వేసేందుకు దుక్కి దున్నుతుండగా నాగలికి తగిలి, కొన్ని పురాతన బంగారు ఆభరణాలు రైతుకు దొరికాయి. అయితే, ఈ నిధులను రహస్యంగా దాచాలనుకున్న కౌలు రైతుకు, అక్కడ ఉన్న కూలీలకు మధ్య పంపకాల విషయంలో గొడవ జరగడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన పొలం యజమాని ప్రతాప్ రెడ్డి రంగంలోకి వచ్చారు. దొరికిన సొమ్ములో తన వాటా ఏంటో తేల్చాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో, ఆరేళ్ల క్రితం ప్రతాప్ రెడ్డికి ఈ భూమిని అమ్మేసిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అవి తమ కుటుంబానికి చెందిన ఆస్తులని వాదించి.. అందులో తన వాటా ఏంటని నిలదీశారు. కానీ, పొలం సాగుచేస్తున్నది తానే గనుక అదంతా తనదేనని కౌలు రైతు వాదించాడు. దీనికి పాత యజమాని, కౌలు రైతులు ఒప్పుకోకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వార్త ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు, ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉండేవని, అందువల్లే ఇక్కడ గుప్తనిధులు బయటపడ్డాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ భూమిలో ఇంకా నిధులు ఉన్నాయనే ప్రచారంతో.. ఆ పొలాన్ని కౌలుకు తీసుకోవడానికి స్థానిక రైతులు ఎంత ధరైనా పెట్టేందుకు పోటీ పడుతుండటం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అసలు..ఈ భూమిలో దొరికిన బంగారం ఎంత..? పంచుకున్నది ఎంత..? ఆ బంగారం ఎవరికి చెందుతుంది..అనే చర్చ జోరందుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!

8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!

బావిలో పడ్డ మేక.. ఆ తర్వాత..

Follow Us