మరింత తగ్గిన బంగారం ధర

డిల్లీ:గత కొంకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అదే ప్లోలో కొనసాగుతుంది. సోమవారం రూ.280 తగ్గడంతో రూ.33,000 దిగువకు చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ రూ.32,830కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానికంగా డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని ట్రేడర్లు వెల్లడించారు. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 0.31 శాతం తగ్గడంతో ఔన్సు బంగారం విలువ 1,299.30 డాలర్లు పలికింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. […]

మరింత తగ్గిన బంగారం ధర
Follow us

|

Updated on: Mar 18, 2019 | 7:06 PM

డిల్లీ:గత కొంకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అదే ప్లోలో కొనసాగుతుంది. సోమవారం రూ.280 తగ్గడంతో రూ.33,000 దిగువకు చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ రూ.32,830కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానికంగా డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని ట్రేడర్లు వెల్లడించారు. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 0.31 శాతం తగ్గడంతో ఔన్సు బంగారం విలువ 1,299.30 డాలర్లు పలికింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. రూ.345 తగ్గడంతో కేజీ వెండి విలువ రూ. 38,725 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధరలో తగ్గుదల నమోదైంది.