మరోసారి పరుగు పెట్టిన పసిడి ధర

|

Nov 10, 2020 | 8:11 PM

కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌పై సానుకూల ప్రకటనతో సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ ఊపందుకుంది.

మరోసారి పరుగు పెట్టిన పసిడి ధర
Follow us on

కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌పై సానుకూల ప్రకటనతో సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ ఊపందుకుంది. అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటిస్తుందనే అంచనాల నడుమ పసిడి ధరలు పరుగులు పెట్టాయి. మరోవైపు, కరోనా వైరస్‌ కేసులు పెరగడంతో బంగారంపై పెట్టుబడులకు మదుపరులు మొగ్గుచూపారు. దీంతో మరోసారి అమాంతం పైపైకి ఎగిసింది. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధర 1880 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. అటు వెండి 24.28 డాలర్లు పలికింది.

ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 640 రూపాయలు పెరిగి 50,388 రూపాయలు పలకగా, కిలో వెండి ఏకంగా 1,273 రూపాయలు ఎగబాకి 62,127 రూపాయలకు చేరుకుంది. మరోవైపు, ఆల్‌టైం హై నుంచి బంగారం ధరలు ఇటీవల కొద్దిగా దిగిరావడంతో దివాళి, ధంతేరస్‌ల సందర్భంగా డిమాండ్‌ పెరగవచ్చని బులియన్‌ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, రూపాయి మారక విలువ డాలర్ తో పోల్చిే 74.27 గా ఉంది.