ఉత్కంఠ రేపుతున్న లాంచీ వెలికితీత..అంతలోనే ట్విస్ట్

గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాద మృతదేహాల వెలికితీత విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బోటు లోపల చిక్కుకున్న మృతదేహాలు ఎలా తీయాలన్న విషయంలో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ నెల 15 కచ్చలూరు వద్ద ప్రమాదానికి గురైన లాంచీలో పర్యాటకులు, 8 మంది సిబ్బందీ కలిపి మొత్తం బోటులో 73 మంది ఉంటారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. అసలు పూర్తిగా ఎంతమంది ఉన్నారనేది సరైన సమాచారం లేదు. ఎందుకంటే టికెట్లు తీసుకున్నవారంతా ప్రయాణించకపోవచ్చు లేదా టికెట్లు లేకుండా […]

ఉత్కంఠ రేపుతున్న లాంచీ వెలికితీత..అంతలోనే ట్విస్ట్
Follow us

|

Updated on: Sep 19, 2019 | 7:08 PM

గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాద మృతదేహాల వెలికితీత విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బోటు లోపల చిక్కుకున్న మృతదేహాలు ఎలా తీయాలన్న విషయంలో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ నెల 15 కచ్చలూరు వద్ద ప్రమాదానికి గురైన లాంచీలో పర్యాటకులు, 8 మంది సిబ్బందీ కలిపి మొత్తం బోటులో 73 మంది ఉంటారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. అసలు పూర్తిగా ఎంతమంది ఉన్నారనేది సరైన సమాచారం లేదు. ఎందుకంటే టికెట్లు తీసుకున్నవారంతా ప్రయాణించకపోవచ్చు లేదా టికెట్లు లేకుండా అప్పటికప్పుడే కొందరు రావచ్చు అనే కారణాలతో ఈ సంఖ్యలో మార్పు ఉండొచ్చని అధికారుల అంచనా.

దగ్గర్లో ఉన్న జాలర్లు కొంతమంది ప్రాణాలను కాపాడగలిగారు. వీరిలో మొత్తం 24 మంది పురషులు, ఇద్దరు మహిళలతో కలిపి 26 మంది క్షేమంగా బయటపడ్డారు. నేవీ, ఎన్టీఆర్, ఎస్డీఆర్‌ఎఫ్ చేస్తున్న సెర్చింగ్‌లో  ఇప్పటి వరకూ 34 మృతదేహాలు దొరికాయి. వాటిలో 23 మగవారివి, 8 ఆడవారివి, 3 పిల్లలవి.

బుధవారం ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది  సైడ్ స్కాన్ సోనార్ మెషీన్ ద్వారా బోటు జాడ గుర్తించారు. కచ్చులూరు దగ్గర్లో ప్రమాదం జరిగిన చోట 210 అడుగుల లోతులో బోటు ఉంది. బోటు ఏ  ప్రదేశంలో ఉంది అన్నదానిపై కూడా స్పష్టత వచ్చింది.

ప్రస్తుతం అధికారులు బోటు వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం కొన్ని ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నారు. కాకినాడ, ముంబైలకు చెందిన నిపుణులు, ప్రైవేటు సంస్థల వారినీ పిలిపించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులూ, నిపుణులూ కలసి ఏ విధంగా బోటును బయటకు తీయాలి అనే విషయమై చర్చించారు. రకరకాల పద్ధతుల గురించి చర్చ జరుగుతోంది.

బోటును బయటకు తీయడంలో ఎందుకింత ఆలస్యం:

గోదావరి వరద ఉదృతి ఎక్కువగా ఉండడం, ప్రమాదం జరిగిన చోట గోదావరి నది సన్నగా ఉండి లోతు ఎక్కువగా ఉండడం, దాదాపు 210 అడుగుల లోతున విపరీతమైన ఒత్తిడి ఉండడం, బయట కురుస్తున్న భారీ వర్షాలు, ప్రమాదం జరిగిన చోట నీరు కొండను తాకి  సుడులు తిరుగుతూ ప్రవహిస్తూండడం.. ఇవన్నీ కలసి బోటు తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి.

బోటును బయటకు తీయడం ఎలా?:

1.ఒకటి గజ ఈతగాళ్లు లోపలికి వెళ్లి ఆ బోటుకు చైన్లను లింక్ చేస్తారు. అప్పుడు పైనుంచి క్రేన్ల సాయంతో బయటకు తీస్తారు. కానీ లోతు స్థాయి అధికంగా ఉండటం వల్ల..గజ ఈతగాళ్లు అంత దూరం వరకు వెళ్లే స్థాయి లేదు. సో ఈ అప్షన్‌లో వెలికితీత కుదరదు.

2. యాంకర్లను కట్టిన తాళ్లను బోటు ఉన్న ప్రాంతంలో విసురుతారు. అవి బోటుకు ఏదో ఒక భాగంలో అతుక్కుంటాయి. అప్పుడు పైకి లాగుతారు. కానీ నీరు కదలకుండా ఉంటేనే ఈ పద్దతి సాద్యమవుతుంది. లేకపోతే నీటి ప్రవాహా వేగానికి విసిరిన తాళ్లు పక్కకు వెళ్లిపోతాయి. అయినా కూడా ఇది 50..50 ఛాన్సస్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత బోటు విషయంలో అక్కడి లోతు, నీటి వేగం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పద్దతి కూడా సాధ్యపడటం లేదు.

3. ఇది అతి క్లిష్టమైన పద్దతి. సుమారు వెయ్యి అడుగులు బలమైన తాళ్లను తెప్పించి బోటు ఉన్న ప్రాంతం చుట్టూ నీటిలోకి వేస్తారు. ఆ తాడు మెషీన్ల సాయంతో  కిందకు వెళ్లి బోటును చుట్టుకునేలా వేస్తారు. అప్పుడు దాన్ని పైకి లాగుతారు. కానీ ఇది సక్సెస్ అయ్యే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉంటాయి. ఈ పద్దతిపై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా బోటు మునిగి 5 రోజులు కావడంతో దొరకని వారంతా చనిపోయి ఉంటారని.. మృతదేహాలు కూడా కుళ్లిపోయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక చేపలు, జలచరాలు వంటివి మృతదేహాలను డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.