సోషల్‌ మీడియాలో జోకులు.. ఎట్టకేలకు మారనున్న ఆస్ట్రేలియన్ గ్రామం పేరు.. ఇక చాలించండి అన్న మేయర్‌

కొన్ని ఊర్ల పేరు వింటే నవ్వొస్తుంది. మరికొన్ని ఊర్ల పేరు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొన్ని ఊర్ల పేర్లు పలకడానికి కూడా కష్టంగా ఉంటాయి.

సోషల్‌ మీడియాలో జోకులు.. ఎట్టకేలకు మారనున్న ఆస్ట్రేలియన్ గ్రామం పేరు.. ఇక చాలించండి అన్న మేయర్‌
Follow us

| Edited By:

Updated on: Nov 27, 2020 | 3:41 PM

Australian village name: కొన్ని ఊర్ల పేరు వింటే నవ్వొస్తుంది. మరికొన్ని ఊర్ల పేరు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొన్ని ఊర్ల పేర్లు పలకడానికి కూడా కష్టంగా ఉంటాయి. అయితే ఆస్ట్రేలియాలోని ఓ గ్రామం పేరు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు కూడా వచ్చేవి. అంతేకాదు అక్కడి ప్రజలను కూడా తప్పుగా సంబోధించేవారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు విసిగిపోయారు. ఎట్టకేలకు తమ ప్రాంత పేరును మార్చుకోనున్నారు. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు మొదలుకానున్న నేపథ్యంలో.. ఆ ఊరి పేరు కూడా మారబోతోంది. (భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు వదిలి వెళ్లిన భర్త.. 19 నెలల తరువాత)

వివరాల్లోకి వెళ్లే.. వియన్నాకు 350కి.మీల దూరంలో ఉండే ఓ గ్రామానికి ఇంగ్లీష్‌లో అసభ్య పదాల్లో ఒకటైన F**king అనే పేరు ఉంది. అక్కడ వంద మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా అక్కడకు వెళ్తోన్న పర్యాటకులు ఆ ప్రాంతం పేరుపై జోకులు వేసేవారు. ఆ ఊరి దగ్గర ఫొటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అలాగే అక్కడి వారిని అదే అసభ్య పదజాలంతో పిలిచేవారు. దీంతో విసిగిపోయిన అక్కడి వారు పేరును మార్చమని అర్జీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతం పేరు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫగ్గింగ్‌(Fugging)గా మారనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మాట్లాడిన స్థానిక మేయర్‌.. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పాలనుకోవడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో ఇకపై జోకులు ఆపండి అని అభ్యర్థించారు. (సంజయ్‌ దత్‌ని కలిసిన కంగనా రనౌత్‌.. ఖల్‌ నాయక్‌ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారన్న నటి)

Latest Articles
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి