భారతదేశం పూర్తి వ్యవసాయ ఆధారిత దేశం. ఈ జీకే నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. రైతులు దేశానికి వెన్నెముక.
పండిన పంటకు గిట్టుబాటు ధర సరిగ్గా పొందలేక నేటి యువత వ్యవసాయం కాకుండా ఇతర రంగాల్లోకి అడుగుపెడుతున్నారు.
దేశంలో సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతున్న రైతుల కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈశాన్య, ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు.
మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల కంటే ఈ రైతులు ఆర్థికంగా ధరవంతులు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దౌలత్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న రామశరణ్ వర్మ భారతదేశంలోని అత్యంత సంపన్న రైతు.
అతను యూపీకి చెందిన పెద్ద రైతు. 1990లో కేవలం 5 ఎకరాల్లో వ్యవసాయం ప్రారంభించారు. రాంశరణ్ వర్మ 200 ఎకరాలకు పైగా భూమిలో వ్యవసాయం చేస్తున్నారు.
వ్యవసాయంలో ఈ అంకితభావానికి 2019లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
రాంశరణ్ వర్మ ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. దీని కారణంగా అతని వార్షిక టర్నోవర్ దాదాపు రూ.2 కోట్లు.